Mitchell Starc | ‘మిస్సైల్ స్టార్క్’ నంబర్ 1.. వరల్డ్ కప్ చరిత్రలో ఒకేఒక్కడు
Mitchell Starc : ఐసీసీ టోర్నీలో చెలరేగిపోయే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ చరిత్ర (World Cup)లో అత్యధిక వికెట్ల వీరుడిగా మిస్సైల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు.
Mitchell Starc : ఐసీసీ టోర్నీలో చెలరేగిపోయే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ చరిత్ర (World Cup)లో అత్యధిక వికెట్ల వీరుడిగా మిస్సైల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక వెటరన్ లసిత్ మలింగ (Lasith Malinga) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బద్ధలు కొట్టాడు. అంటిగ్వా వేదికగా జరిగిన సూపర్ 8 తొలి పోరులో ఆసీస్ స్పీడ్‌గన్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్‌ను బౌల్డ్ చేసిన స్టార్క్ వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో 95 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో 65, పొట్టి ఫార్మాట్లో ఈ పేసర్ 30 వికెట్లు తీశాడు. దాంతో, యార్కర్ కింగ్ మలింగ 94 వికెట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. విభిన్నమైన బౌలింగ్ శైలితో మేటి బౌలర్‌గా ఎదిగిన మలింగ వన్డే వరల్డ్ కప్‌లో 56, టీ20 ప్రపంచ కప్‌లో 38 వికెట్లు పడగొట్టాడు. ఈ స్పీడ్‌స్టర్ స్టార్క్ దాటేశాడు.
Mitch Starc on 🔝
The Australia pacer has climbed to the #1 spot for most wickets in Men’s World Cup history across both formats 👏 pic.twitter.com/KAEg6UTy60
— ICC (@ICC) June 21, 2024
వికెట్ల వీరులు వీళ్లే
ఐసీసీ ప్రధాన టోర్నీలైన వన్డే, టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్ల వీరులు ఎవరంటే..? స్టార్క్ 95 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. మలింగ (94 వికెట్లు) రెండో స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్(43/49) 92 వికెట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 87 వికెట్లు (53/34), శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 79 వికెట్లు(68/11)లు వరుసగా నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

