IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన సీఎస్కే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టు పేలవ ప్రదర్శనపై స్పందించాడు. గతేడాది జరిగిన వేలం సమయంలోనే తమ జట్టు తప్పు చేసిందని కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో తమ జట్టు ఆడిన విధానం పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పడం కష్టమేనన్నారు. అయితే, దీన్ని పునః పరిశీలించుకొని మెరుగుపరిచేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చాడు. తమ గత రికార్డులపై గర్వంగా ఉన్నామని.. లీగ్‌లో చాలాకాలంగా ఆధిపత్యం చెలాయించామని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
ఈ దశ నుంచి త్వరగానే బయటపడుతామన్నాడు. అయితే, జట్టును సమర్థించిన కోచ్.. వేలంలో యాజమాన్యం పలు తప్పులు చేసిందని తెలిపాడు. వేలంలో చాలా జట్లు సీఎస్కే కంటే మంచి ఆటగాళ్లను ఎంచుకున్నాయని.. తాము మాత్రం దాన్ని సరిగా చేయలేకపోయామని తెలిపాడు. వేలం అనుకున్నంత వరకు బాగా జరుగలేదని.. కోరుకున్న విధంగా జరుగలేదని తెలిపాడు. వేలం చాలా త్వరగా జరిగే ప్రక్రియని.. నిజాయితీగా చెప్పాలంటే సీఎస్కేకు ఇప్పటికీ మంచి జట్టు ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, జట్టు కలయికను సిద్ధం చేయలేకపోయామని.. తమ జట్టు తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఇంకా ఎంతో సమయం లేదని పేర్కొన్నారు. మరో వైపు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. నలుగురు, ఐదుగురు ఒకేసారి ఫామ్ కోల్పోయిన సమయంలో జట్టు ఆశించిన ఫలితాలను సాధించడం కష్టమని చెప్పాడు. అలాంటి సమయంలో టోర్నీలో ఒకటి, రెండు లోపాలను అధిగమించాల్సి వస్తే అది మంచిదేనని.. కానీ, చాలామంది ఆటగాళ్లు బాగా రాణించిన సమయంలో కష్టంగా మారుతుందని తెలిపాడు.
జట్టు తగినన్ని పరుగులు సాధించలేకపోతుందని.. వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తూనే ఉందని చెప్పాడు. మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కొంచెం మెరుగ్గా ఉందని.. 154 పరుగులు పెద్ద స్కోర్ ఏం కాదని.. బంతి పెద్దగా తిరగలేదని.. రెండో ఇన్నింగ్స్‌లో కొంత సహకారం లభించిందని చెప్పాడు. నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారని.. సరైన దిశలోనే బౌలింగ్ చేస్తున్నారని తెలిపాడు. తాము మాత్రం బ్యాటింగ్‌లో మరో 15-20 పరుగులు తక్కువ చేశామని చెప్పాడు. 42 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ధోనీ ప్రశంసించాడు. డేవిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. మిడిల్ ఆర్డర్లో ఇలాంటి ప్లేయర్స్ అవసరమని చెప్పాడు. ఇదిలా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉన్నది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో రెండు విజయాలు నమోదు చేసి.. ఏడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.