Kumar Kartikeya: తొమ్మిదేళ్ల తర్వాత అమ్మను కలిసిన ముంబై ఇండియన్స్ స్పిన్నర్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఇటీవలే ముగిసిన సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లను దూరం చేసుకున్న ముంబైకి ఈసారి పలువురు కొత్త కుర్రాళ్లు భావితారలుగా అవతరించారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఇటీవలే ముగిసిన సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లను దూరం చేసుకున్న ముంబైకి ఈసారి పలువురు కొత్త కుర్రాళ్లు భావితారలుగా అవతరించారు. వారిలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఒకడు. క్రికెట్ ప్రాణంగా బ్రతికిన కార్తికేయ.. 15 ఏళ్ల వయసులో ఇంట్లోంచి బయటకు వచ్చిన తొమ్మిదేండ్లకు తన తల్లిని కలిశాడు.
ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి భారం కాకూడదని భావించిన కార్తికేయ.. 15 ఏళ్ల వయసులోనే ఇంటి (మధ్యప్రదేశ్) నుంచి బయటకు వచ్చాడు. ముంబైకి చేరి అక్కడ దొరికిన పనిచేశాడు. ముంబైలో ఓ ఫ్యాక్టరీలో పనిచేశాడు. మధ్యాహ్నం పూట అన్నం తింటే రూ. 10 ఖర్చు చేయాల్సి వస్తుందని ఏడాది పాటు లంచ్ కూడా మానేశాడు. కొంచెం ఆర్థికంగా కుదురుకున్నాక తనకు ఇష్టమైన క్రికెట్లో తానేంటో నిరూపించుకుని 2018లో మధ్యప్రదేశ్ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు.
2022 ఐపీఎల్ వేలంలో కార్తికేయను ముంబై జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ముంబై తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించాడు. ఐపీఎల్ సందర్భంగా మాట్లాడుతూ.. తాను 9 ఏండ్లుగా ఇంటికి వెళ్లలేదని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అతడు.. సుదీర్ఘ విరామానికి చెక్ పెడుతూ తల్లిని కలిశాడు.
ఈ మేరకు కార్తికేయ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపాడు. ‘9 ఏళ్ల 3 నెలల తర్వాత అమ్మను, నా కుటుంబాన్ని కలిశాను. నా ఫీలింగ్స్‌ను వెల్లడించడానికి మాటలు రావడం లేదు..’అని ట్వీట్లో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

