న్యూఢిల్లీ: భారతీయ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయ్ ఛాను మళ్లీ మెరిసింది. నార్వేలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నది. 48 కేజీల కేటగిరీలో ఆమె పోటీపడింది. ఈ ఈవెంట్లో ఆమె మొత్తం 199 కేజీల బరువును ఎత్తింది. స్నాచ్ విభాగంలో 84 కేజీల బరువు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కేజీల బరువును ఆమె ఎత్తి రికార్డు సృష్టించింది. అయితే ఈ టోర్నమెంట్లో స్వర్ణ పతకాన్ని కొరియాకు చెందిన వెయిట్‌లిఫ్టర్ రీ సోంగ్ గుమ్ గెలుచుకున్నది. ఆమె మొత్తం 213 కేజీల బరువును ఎత్తింది.
మీరాభాయ్ ఛాను గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. 2017లో జరిగిన పోటీల్లో ఆమె గోల్డ్ మెడల్ కొట్టింది. అప్పుడు ఆమె 49 కేజీల డివిజన్లో పోటీపడింది. ఆ తర్వాత 2022లో 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్‌ను ఛాను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈవెంట్లో స్నాచ్ విభాగంలో ఛాను కొంత కష్టపడింది. 87 కేజీల వద్ద ఆమె రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. కానీ క్లీన్ అండ్ జర్క్ విభాగంలో ఆమె తన రిథమ్‌ను అందుకున్నది. మూడు ప్రయత్నాల్లోనూ ఛాను సక్సెస్ అయ్యింది.
#WATCH || Indian weightlifter 𝐌𝐢𝐫𝐚𝐛𝐚𝐢 𝐂𝐡𝐚𝐧𝐮 𝐰𝐢𝐧𝐬 𝐬𝐢𝐥𝐯𝐞𝐫 🥈 𝐢𝐧 𝐰𝐨𝐦𝐞𝐧’𝐬 𝟒𝟖𝐤𝐠 𝐚𝐭 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 in #Førde, #Norway.
🏋She lifted a total of 199kg (84kg snatch + 115kg clean and jerk). Gold went to Korea’s Ri Song-gum with… pic.twitter.com/iHMxWLMckj
— SansadTV (@sansad_tv) October 3, 2025