న్యూఢిల్లీ: వచ్చే నెల జపాన్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా గేమ్స్ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 492 మందితో కూడిన భారత క్రీడాకారుల బృందానికి శనివారం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో 265 మంది పురుషులు, 227 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 73 మంది ఎంపికయ్యారు. వ్యక్తిగత క్రీడాంశాల్లో షూటింగ్ (30), బ్యాడ్మింటన్ (20), రెజ్లింగ్ (16), బాక్సింగ్ (11)ఎక్కువ మంది పోటీలో నిలిచారు.