Kilimanjaro | హైదరాబాద్, ఆట ప్రతినిధి: టాంజానియా దేశంలోని అతిపెద్ద పర్వతం మౌంట్ ఖిలిమంజారో పర్వతాన్ని(5895మీటర్లు) అధిరోహించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బానోతు వెన్నెలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. చిన్నవయసు(16)లో మౌంట్ కిలిమంజారో ఎక్కిన వెన్నెలను ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం’ అని అన్నారు. ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళుతున్న తనకు ప్రభుత్వ మద్దతు కావాలని వెన్నెల కోరగా, మంత్రి తక్షణమే స్పందించారు. క్రీడాశాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.