మీర్పూర్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్.. బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట బంగ్లా 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ హుసేన్ (76) టాప్ స్కోరర్ కాగా.. ఆడమ్ మిల్నె 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కివీస్ 34.5 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. విల్ యాంగ్ (70), హెన్రీ నికోల్స్ (50 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు.