జైపూర్: మిడిలార్డర్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ (46 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్ కొనసాగించడంతో.. హైదరాబాద్ వరుసగా మరో విజయం ఖాతాలో వేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. విక్రమ్‌కుమార్ (73) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో తనయ్, రవితేజ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్ చేసింది. తిలక్‌తో పాటు మికిల్ జైస్వాల్ (32), తనయ్ త్యాగరాజన్ (24) రాణించారు.