బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిలకడగా ఆడుతోంది. గత మ్యాచుల్లో తక్కువ స్కోరుకే వికెట్ పారేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (26) రాణించాడు. అతనికి ఇషాన్ కిషన్ (22 నాటౌట్) నుంచి మంచి సహకారం అందించడంతో ముంబై జట్టు బ్యాటింగ్ నిలకడగా సాగింది. వీళ్ల భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు బెంగళూరు కెప్టెన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
దీంతో పవర్‌ప్లేను 49/0 తో ముగించిన ముంబైని హర్షల్ పటేల్ తన తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. అతను వేసిన స్లో ఆఫ్ కట్టర్‌ను రోహిత్ అంచనా వేయలేకపోయాడు. దాన్ని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని హర్షల్ పటేల్ ముందుకొచ్చి అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 పరుగుల వద్ద ముంబై జట్టు తొలి వికెట్ కోల్పోయింది.