కోల్‌కతా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (7) అవుటవడంతో ముంబైపై లక్ష్య ఛేదన కష్టంగా మారిందనుకుంటే.. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా మరోసారి నిరాశపరిచాడు. శామ్స్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన శ్రేయాస్.. టైమింగ్ మిస్ అవడంతో స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ దక్కింది.
దాన్ని అక్కడ ఉన్న తిలక్ వర్మ చక్కగా అందుకోవడంతో శ్రేయాస్ చిరాగ్గా పెవిలియన్ చేరాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కోల్‌కతా జట్టు 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలలో టైమల్ మిల్స్, డానియెల్ శామ్స్ చెరో వికెట్ తీసుకున్నారు.