ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ (43) అవుటయ్యాడు. కుమార్ కార్తికేయ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టిన వెంకటేశ్.. మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. కార్తికేయ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు వెంకటేశ్ ప్రయత్నించాడు.
అయితే కార్తికేయ వేసిన లెంగ్త్‌ను అంచనా వేయలేకపోడంతో బంతి అతని బ్యాట్‌ను సరిగా తాకలేదు. దాంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని కవర్స్‌లో ఉన్న శామ్స్ చక్కగా అందుకోవడంతో వెంకటేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కోల్‌కతా జట్టు ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం అజింక్య రహానే, నితీష్ రాణా క్రీజులో ఉన్నారు.