Hayley Matthews | డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ జోక్స్ వేస్తుంది.. ఆమె గేమ్ ప్లానింగ్ అద్భుతం : మాథ్యూస్
డబ్ల్యూపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టకుంటున్న ఈ విధ్వంసక ఓపెనర్ తమ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ప్రశంసలు కురిపించింది. ప్లేయర్స్ నుంచి ఏం కావాలి అనేది హర్మన్‌ప్రీత్‌కు బాగా తెలుసు అని ఆమె తెలిపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హాఫ్ సెంచరీ(77)తో జట్టును విజయ తీరాలకు చేర్చింది.
Hayley Matthews : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ పవర్ హిట్టింగ్తో దుమ్ము రేపుతోంది. ఈ లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టకుంటున్న ఈ విధ్వంసక ఓపెనర్ తమ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ప్రశంసలు కురిపించింది. ప్లేయర్స్ నుంచి ఏం కావాలి అనేది హర్మన్‌ప్రీత్‌కు బాగా తెలుసు అని ఆమె తెలిపింది. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ చాలా సరదాగా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది.
జట్టులోని ప్రతి ప్లేయర్ నుంచి ఏం కావాలి? అనేది ఆమెకు బాగా తెలుసు. ఆ విషయంలో ఆమె పక్కా ప్లానింగ్‌తో ఉంటుంది’ అని హేలీ వెల్లడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హాఫ్ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. కీలక ఇన్నింగ్స్‌తో జట్టను గెలిపించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
రికార్డు భాగస్వామ్యం
సూపర్ ఫామ్‌లో ఉన్న హేలీ మాథ్యూస్ ముంబైకి శుభారంభం ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ఈ విధ్వంసక ఓపెనర్ 47 రన్స్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్‌లో 28 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది. 38 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 77 రన్స్ చేసింది. నాట్ సీవర్ బ్రంట్(55)తో కలిసి రెండో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో, ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 155కు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఒక్కరు కూడా 30 రన్స్ చేయలేకపోయారు. రీచా ఘోష్ (28), కనికా ఆహుజా (23), కెప్టెన్ స్మృథి మంధాన (23) తక్కువకే పెవిలియన్ చేరారు. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక పోయింది.
ఇవి కూడా చదవండి
S Dinakar | భారత్ – ఆస్ట్రేలియా సిరీస్ కవరేజ్ ఇస్తున్న సీనియర్ జర్నలిస్ట్ మృతి
Hardik Pandya | పాండ్యా అరుదైన రికార్డు.. దిగ్గజాలను దాటుకుని
RCB vs MI | హ్యాట్సాఫ్ మాథ్యూస్.. దంచికొట్టిన ఆల్‌రౌండర్.. ముంబై రెండో విజయం..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

