Hardik Pandya | టీం ఇండియా (Team India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న యంగెస్ట్ క్రికెటర్ (Youngest Cricketer)గా గుర్తింపు సాధించాడు. ఈ ఘనతతో ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ (Cricketer)గా రికార్డుకెక్కాడు పాండ్యా. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్ (Rafael Nadal), రోజర్ ఫెదరర్ (Roger Federer), డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (Max Verstappen ) వంటి దిగ్గజాల కంటే ఎక్కువ మంది ఫాలోవర్ల (Followers)ను సంపాదించుకుని హార్దిక్ ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.
ఈ సందర్భంగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. ‘నాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కిరికీ ధన్యవాదాలు’ అని పాండ్యా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం ఇన్‌స్టా (Instagram)లో పాండ్యాను 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే 25 కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడన్న మాట.
Also Read..
Holi: ఉజ్జయిని మహాకాలేశ్వురుడి సన్నిధిలో హోళీ.. వీడియో
Meta Platforms: వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా
Urinary Tract Infection | మా బాబు మూత్రం పోస్తున్నప్పుడు వెక్కివెక్కి ఏడుస్తాడు.. సమస్య ఏంటి?