మాంట్రియాల్: బాక్సింగ్ బౌట్లో పాల్గొన్న ఓ యువ బా క్సర్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది. మెక్సికోకు చెందిన 18 ఏండ్ల బాక్సర్ జెన్నెట్ట జకారియా గత శనివారం జరిగిన ఓ బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ పోటీలో ప్రత్యర్థి మారీ పేయిర్.. జపాటాపై పంచ్‌ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో జెన్నెట్ట తలకు తీవ్ర గాయాలయ్యాయి. అచేతనావస్థలో పడి ఉన్న ఆమెను దవాఖానాలో చేర్పించి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. కడవరకు మృత్యువుతో పోరాడిన ఆమె గురువారం కన్నుమూసింది.