రాంచీ: భారత మాజీ కెప్టెన్ ధోనీ కూతురు జీవా ధోనీ ఈ క్రిస్మస్కు ప్రత్యేక కానుక లభించింది. ఫిఫా ప్రపంచకప్ గెలుచుకున్న అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీ జీవాకు చేరింది. ఫుట్బాల్ ప్రియుడైన ధోనీ..ఐఎస్ఎల్ ఫ్రాంచైజీ చెన్నైయిన్ ఎఫ్సీ సహ యజమాని. అతని ఏడేండ్ల కూతురు జీవా.. మెస్సీ సంతకం చేసిన జెర్సీని ధరించి మురిసిపోయింది. ఈ ఫొటోను ధోనీ భార్య సాక్షి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ‘లైక్ ఫాదర్, లైక్ డాటర్(తండ్రికి తగ్గ తనయ)’ అని కాప్షన్ రాసుకొచ్చింది. జీవా ధరించిన జెర్సీపై ‘పార జీవా(ఫర్ జీవా)’ అని మెస్సీ సంతకంతో ఉంది.