న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పైనల్లోకి ఇండియన్ మెన్స్ జోడి ప్రవేశించింది. పురుషల డబుల్స్ కేటగిరీలో సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి, చిరాగ్ శెట్టి(Satwik-Chirag) వరుస గేమ్‌ల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. వరల్డ్ నెంబర్ 9 జోడి .. సెమీస్‌లో చైనీస్ తైపికి చెందిన బింగ్ వెయి లిన్, చెన్ చెంగ్ కౌన్పై 21-17, 21-15 స్కోరుతో విజయం సాధించారు. ఆరు సార్లు సెమీఫైనల్లో ఓడిన ఈ జంట ఎట్టకేలకే తొలిసారి ఓ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో భారత డబుల్స్ జోడి 8వ సీడెడ్‌గా బరిలోకి దిగింది. గతంలో సాత్విక్ జోడి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గె లుచుకున్నది. సైనా నెహ్వాల్, పీవీ సింధు తర్వాత పలు ఈవెంట్లలో మెడల్స్ సాధించిన ప్లేయర్స్‌గా నిలిచారు.