ODI World Cup | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు అనుకోని అవాంతరం ఎదురైంది. గతంలో వర్షం కారణంగా, వాతావరణం సహకరించక పలు మ్యాచ్‌లు నిలిచిపోగా.. కొన్ని సందర్భల్లో మైదానంలోకి కుక్కలు, పిల్లులు దూసుకురావడంతోనూ మ్యాచ్‌లు ఆగాయి. ఇక మరి కొన్నిసాౖర్లెతే తేనెటీగల గుంపు మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.. ఇటీవల శ్రీలంక క్రికెట్ లీగ్‌లో పాము వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం వాటిల్లింది.
అయితే ఇవేవీ కాకుండా కూడా మ్యాచ్ నిలిచిపోయే అవకాశం ఉందని.. భారత్, కివీస్ పోరు రుజువు చేసింది. ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్కసారిగా మైదానాన్ని మంచు తెర కప్పేసింది. దీంతో ప్లేయర్లకు ముందున్నదేదీ కనబడక ఇబ్బంది పడ్డారు. దీంతో అంపైర్లు కాసేపు మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఛేదనలో టీమ్ఇండియా 15.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులతో ఉన్న సమయంలో ఒక్కసారిగా స్టేడియాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలా’ అనే మీమ్ బాగా ఫేమస్ అవుతున్నది.
ఫలితంగా ఆటగాళ్లతో మాట్లాడిన అంపైర్లు కాసేపు ఆటకు విరామం ఇచ్చారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ మైదానాల్లో ఒకటైన ధర్మశాలలో.. హిమాలయ పర్వత సానువుల్లో మ్యాచ్‌లు ఆడటం కంటే మంచి ఫీలింగ్ ఏముంటుందని న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్ పేర్కొన్నాడు. ‘వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న జట్టుతో తలపడేందుకు ఇంతకన్నా మంచి వేదిక మరొకటి ఉండదు. ధర్మశాలలో క్రికెట్ ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా’ అని బౌల్ట్ వెల్లడించాడు.