French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. పురుషుల విభాగంలో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (Danil Medvedev)కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కుర్రాడు అలెక్స్ డి మినౌర్(Alex de Minaur) చేతిలో రష్యా స్టార్ చిత్తుగా ఓడిపోయాడు.
రెండు గంటల 49 నిమిషాల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో మినౌర్ అద్భుతంగా ఆడాడు. తొలి సెట్ కోల్పోయినా అనూహ్యంగా పుంజుకొని 4-6, 6-2, 6-1, 6-3 విజేతగా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్ చేరాలనుకున్న మెద్వెదేవ్‌ను ఇంటికి పంపించాడు.
మహిళల టాప్ సీడ్ ప్లేయర్ అరినా సబలెంక(Aryna Sabalenka) రఫ్పాడిస్తోంది. వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెలారస్ భామ ఇరగదీసింది. అమెరికాకు చెందిన ఎమ్మా నవర్రోను 6-2, 6-2తో చిత్తుగా ఓడించింది. దాంతో, ఈ ఏడాది 11వ గ్రాండ్‌స్లామ్ విజయం ఖాతాలో వేసుకుంది.
And that’s how it’s done…
By @SabalenkaA #RolandGarros pic.twitter.com/ExNH92H7A5
— Roland-Garros (@rolandgarros) June 3, 2024
మిర్రా అండ్రీవా, వరవరా గ్రాచెవా మ్యాచ్ విజేతతో సబలెంక క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. మరో మ్యాచ్‌లో ఇటలీ కెరటం జాస్మినే పవోలిని(Jasmine Paolini) జయకేతనం ఎగురవేసింది. 28 ఏండ్ల జాస్మినే కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
Joy for Jasmine#RolandGarros pic.twitter.com/XRBSGgY3Hz
— Roland-Garros (@rolandgarros) June 3, 2024