మెల్బోర్న్: తాత్కాలిక కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పదోన్నతి కల్పించింది. అన్ని ఫార్మాట్లలో అతడికి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తూ సీఏ బుధవారం నిర్ణయం తీసుకుంది. జస్టిన్ లంగర్ పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో టెస్టు మాజీ ఆల్‌రౌండర్ మెక్‌డొనాల్డ్‌ను నియమించింది. 2019 నుంచి కొన్నేండ్ల పాటు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో కోచ్‌గా కొనసాగిన అండ్రూ నాలుగేండ్ల పాటు జాతీయ జట్టుకు సేవలందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆండ్రూ మాట్లాడుతూ.. ‘కోచ్‌గా అవకాశం కల్పించిన సీఏకు ధన్యవాదాలు. ఇది నాకు లభించిన గొప్ప అవకాశం’ అని తెలిపాడు.