భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టికి ఇన్ని రోజులు కోచ్‌గా వ్యవహరించిన మతియస్ బోతన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో సాత్విక్, చిరాగ్ పోరు అర్ధాంతరంగా ముగియడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు బో శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
లండన్(2012) ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన ఈ 44 ఏండ్ల డెన్మార్క్ మాజీ ప్లేయర్ గత కొన్నేండ్లుగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్‌గా ఉన్నాడు. ‘నా వరకు కోచింగ్ రోజులు ఇక్కడితో ముగిశాయి. భారత్‌లోనే కాదు ఎక్కడా కూడా నేను కోచ్‌గా కొనసాగడం లేదు. బ్యాడ్మింటన్ హాల్లో చాలా సుదీర్ఘ సమయం గడిపి అలసిపోయాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.