RSA vs NED : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్(Netherlands) జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. అన్రిచ్ నోర్జి(Anrich Nortje) వేసిన 12 వ ఓవర్లో ఇద్దరు ఔట్ కావడంతో డచ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ఎడెన్ మర్క్రమ్ మెరుపు ఫీల్డింగ్‌కు సారథి స్కాట్ ఎడ్వర్డ్స్(10) రనౌట్ అయ్యాడు.
ఆ కాసేపటకే తెలుగు మూలాలున్న కుర్రాడు తేజ నిడమనూరు(0) వికెట్ పారేసుకున్నాడు. దాంతో 48 పరుగులకే నెదర్లాండ్స్ ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం లొగన్ వాన్ బీక్(1), సిబ్రాండ్ ఎంగ్లెబ్రెట్చ్(16)లు ఆడుతున్నారు. 13 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోర్.. 52/6.