IPL 2025 : సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దంచేశారు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(52) హాఫ్ సెంచరీతో గర్జించగా.. మిచెల్ మార్ష్(45) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. పవర్ ప్లే తర్వాత పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్లు లక్నోను కట్టడి చేశారు. ముకేశ్ కుమార్(4-33) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. అయితే.. ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(36), డేవిడ్ మిల్లర్(14 నాటౌట్)లు డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడారు.ముకేశ్ వేసిన 20వ ఓవర్లో బదొని బౌండరీతో స్కోర్ 150కి చేరింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు రావడంతో, లక్నో ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
సొంతగడ్డపై లక్నోసూపర్ జెయింట్స్ శుభారంభాన్ని సద్వినియోగం చేసకోలేకపోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు మర్క్రమ్(50), మిచెల్ మార్ష్(32)లు చెలరేగి ఆడారు. ముకేశ్, స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరి జోరుతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 51 రన్స్ కొట్టింది లక్నో. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన మర్క్రమ్ జోరు పెంచే క్రమంలో చమీర బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్టబ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. 87 వద్ద తొలి వికెట్ కోల్పోయిన లక్నోకు స్టార్క్ డేంజరస్ నికోలస్ పూరన్(9)ను వెనక్కి పంపి మరో షాకిచ్చాడు.
That one had fire written all over it 🔥
🎥 Mukesh Kumar ends Mitchell Marsh’s charge with an unplayable yorker 🎯
Updates ▶️ https://t.co/nqIO9maALU#TATAIPL | #LSGvDC | @DelhiCapitals pic.twitter.com/LT5ufqjZYC
— IndianPremierLeague (@IPL) April 22, 2025
ముకేశ్ ఇక తనవంతు అన్నట్లు ఒకే ఓవర్లో అబ్దుల్ సమద్(2), మార్ష్‌ను ఔట్ చేసి లక్నోను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయుష్ బదొని(36) డేవిడ్ మిల్లర్(14 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడి స్కోర్ 150 దాటించారు. ముకేశ్ వేసిన 20వ ఓవర్లో రెచ్చిపోయిన బదొని హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. కానీ, నాలుగో బంతికి బౌల్డయ్యాడు. పంత్(0) సైతం బౌల్డ్ కావడంతో, లక్నో 159కే పరిమితమైంది.