IPL 2025 : సొంతమైదానంలో లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓపెనర్లు మిచెల్ మార్ష్(65), ఎడెన్ మర్క్రమ్(61)లు విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)బౌలర్లను ఉతికేస్తూ అర్ద శతకాలతో లక్నో భారీ స్కోర్‌కు పునాది వేశారు. తొలి వికెట్‌కు 115 రన్స్ జోడించడంతో సులువుగా రెండొందలు కొడుతుందనిపించింది. కానీ, మిడిల్ ఓవర్లలో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. అయితే.. డేంజరస్ నికోలస్ పూరన్(45) డెత్ ఓవర్లర్లో మెరుపు బ్యాటింగ్‌తో లక్నోను 200లకు చేరువ చేశాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో చివరి బంతిని ఆకాశ్ దీప్(6 నాటౌట్) స్టాండ్స్లోపి పంపడంతో లక్నో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పోరులో టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే కమిన్స్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన మిచెల్ మార్ష్(65), నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. 4వ ఓవర్లో మార్ష్ బౌండరీ కొట్టగా.. మర్క్రమ్(61) వరసగా 6, 4తో 17 పరుగులు పిండుకున్నాడు.
Innings Break!#LSG put up 2⃣0⃣5⃣ in a must-win game courtesy of fifties from their openers! 👊
Will #SRH chase this down?
Updates ▶ https://t.co/GNnZh911Xr#TATAIPL | #LSGvSRH | @LucknowIPL pic.twitter.com/2m9ASxUBvW
— IndianPremierLeague (@IPL) May 19, 2025
ఇద్దరూ పోటాపోటీగా ఆడడంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. 28 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్న మార్ష్ మరింత దూకుడుగా ఆడాడు. మర్క్రమ్ సైతం స్పీడ్ పెంచడంతో 10 ఓవర్లకే లక్నో స్కోర్ 100 దాటింది. తొలి వికెట్‌కు 115 రన్స్ జోడించిన ప్రమాదకరంగా మారిన ఈ ఓపెనర్లను అరంగేట్ర కుర్రాడు హర్ష్ దూబే విడదీశాడు. మార్ష్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్()ను ఈషన్ మలింగ(2-28) వెనక్కి పంపాడు. దాంతో, నికోలస్ పూరన్ (45) జతగా మర్క్రమ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అర్ధ శతకంతో జోరుమీదున్న మర్క్రమ్ను హర్షల్ బౌల్డ్ చేయగా 159 వద్ద లక్నో మూడో వికెట్ పడింది.
ఎడెన్ మర్క్రమ్(61), మిచెల్ మార్ష్(65)
కీలక వికెట్లు పడడంతో పూరన్, ఆయుష్ బదొని(3)లు ఆచితూచి ఆడారు. అయితే.. మలింగ ఓవర్లో బదొని ఔట్ కాగా.. కమిన్స్ తన చివరి ఓవర్లో 12 రన్స్ ఇచ్చాడంతే. హర్షల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ బాదిన పూరన్ లక్నో స్కోర్ 190 దాటించాడు. అయితే.. చివర్లో అతడు రనౌట్ కాగా.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్(4) అదే విధంగా వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు ఆకాశ్ దీప్(6 నాటౌట్). దాంతో, లక్నో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.