చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టాయినీస్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్(1)..వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ ఒక ఫోర్ బాదగా, రోహిత్ 4, 6 కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. రబాడ బౌలింగ్‌లోనూ 14 రన్స్ రాబట్టారు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. పవర్‌ప్లే ఆఖరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. రోహిత్(29), యాదవ్(23) క్రీజులో ఉన్నారు.
.@ImRo45 & @surya_14kumar are on song here.
— IndianPremierLeague (@IPL) April 20, 2021
At the end of the powerplay #MumbaiIndians are 55/1
Live – https://t.co/9JzXKHJrH8 #DCvMI #VIVOIPL pic.twitter.com/0RlCwBAZxH