పారిస్ ; ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత మువ్వన్నెల పతకాన్ని చేతబూనే అవకాశం యువ షూటర్ మను భాకర్‌తో పాటు హాకీ దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు దక్కింది. ఈ ఎడిషన్‌లో మను రెండు పతకాలు గెలుచుకోగా కాంస్యం గెలిచిన హాకీ జట్టులో శ్రీజేష్ సభ్యుడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా శ్రీజేష్ను భారత జూనియర్ హాకీ జట్టుకు కోచ్‌గా నియమిస్తూ ‘హాకీ ఇండియా’ సంచలన నిర్ణయం తీసుకుంది.