ఢిల్లీ: మను భాకర్ ‘ఖేల్త్న్ర’ వివాదం కొనసాగుతున్న వేళ పారా షూటర్, పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన షూటర్ హర్విందర్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. క్రీడా అవార్డుల విషయంలో తమపై వివక్ష ఎందుకని ప్రశ్నించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచినవారికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డులు ఇచ్చినప్పుడు పారిస్‌లో బంగారు పతకాలు సాధించినవారికి ఎందుకివ్వరు? అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
అవే పోటీలు, అదే పతకం, అదే గౌరవం తెచ్చినప్పటికీ అవార్డు విషయంలో మాత్రం వివక్ష ఎందుకని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అవని లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్‌కు ఖేల్త్న్ర అవార్డులు వరించాయి.