INDW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (23) వైఫల్యం కొనసాగుతోంది. మెగా టోర్నీకి ముందు భీకర ఫామ్‌లో ఉన్న మంధాన.. ప్రపంచ కప్‌లో మాత్రం స్వల్ప స్కోర్‌కే వెనుదిరుగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన ఈ ఓపెనర్ దక్షిణాఫ్రికాపై కుదురుకున్నట్టే కనిపించింది. కానీ, వికెట్ పారేసుకుంది.
స్పిన్నర్ మలబా ఓవర్లో షాట్‌కు యత్నించిన మంధాన సునే లుస్ చేతికి చిక్కింది. దాంతో.. 55 వద్ద తొలి వికెట్ పడింది. అయినా సరే ఓపెనర్ ప్రతీకా రావల్(31 నాటౌట్) దూకుడుగా ఆడుతోంది. ఆమెకు తోడుగా స్కోర్ వేగం పెంచే బాధ్యతను హర్లీన్ డియోల్(10 నాటౌట్) తీసుకుంటోంది. 15 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 71/1.
Another start that didn’t go the distance for Smriti Mandhana 📉
LIVE ▶️ https://t.co/LFct1SLX3V | #CWC25 | #INDvSA pic.twitter.com/9v6sOnoPQk
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025
వరల్డ్ కప్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు వైజాగ్‌లోనూ శుభారంభం లభించింది. ఓపెనర్ ప్రతీకా రావల్(31 నాటౌట్) ఫోర్లతో విరుచుకుపడగా.. స్మృతి మంధాన (23) నిదానంగా ఆడింది. పదో ఓవర్ వరకూ క్రీజులో నిలిచిన మంధాన గేర్ మార్చబోయి స్వల్ప స్కోర్‌కే ఔటైయ్యింది. మలబా ఓవర్లో ఆమె సునేలుస్ చేతికి దొరికింది. దాంతో.. 55 వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.