IPL 2024 | ఐపీఎల్ వేలంలో ట్విస్ట్.. 15 ఏండ్ల సాంప్రదాయానికి తెరదించిన బీసీసీఐ
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు కొన్ని రోజులే ఉంది. మినీ వేలానికి రెండు వారాలే ఉండడంతో అన్ని ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్ల కొనుగోలుపై భారీ కసరత్తులు మొదలెట్టాయి. ఇక ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ కూడా ఆక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే. ఈసారి ఐపీఎల్ వేలం నిర్వహించే...
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు కొన్ని రోజులే ఉంది. మినీ వేలానికి రెండు వారాలే ఉండడంతో అన్ని ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్ల కొనుగోలుపై భారీ కసరత్తులు మొదలెట్టాయి. ఇక ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ కూడా ఆక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే.. 15 ఏండ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి బీసీసీఐ తెరదించింది. అవును.. 17వ సీజన్ మినీ వేలం నిర్వహించే వ్యక్తి మారుతున్నారు. రిచర్డ్ మెడ్లే తర్వాత 2018 నుంచి వేలం పాటకు వ్యాఖ్యతగా ఉంటున్న హుగ్ ఎడ్మిడ్స్(Hugh Edmeades) స్థానంలో ఈసారి మలికా సాగర్(Malika Sagar) కనిపించనుంది.
ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్(WPL), ప్రో కబడ్డీ లీగ్(PKL) వేలం నిర్వహించిన అనుభవం ఉన్న మలికా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. బ్రిటన్‌కు చెందిన ఎడ్మిడ్స్ 2018లో రిచర్డ్ మెడ్లే(Richard Medeley) నుంచి ఐపీఎల్ వేలం వ్యాఖ్యతగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి 2023 మినీ వేలం వరకూ ఆయనే ఆక్షనీర్‌గా ఉన్నారు.
హ్యారీ బ్రూక్, శార్దూల్ ఠాకూర్, సామ్ కరన్

డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం మొదలవ్వనుంది. ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. నిరుడు కొచ్చిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొన్నది. ఈసారి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరకు రిజిష్టర్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
భారత్ – హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్.
ఇంగ్లండ్ – హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.
ఆస్ట్రేలియా – ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సియాన్ అబాట్.
దక్షిణాఫ్రికా – రీలే రస్సో, రసీ వాండర్ డస్సెన్, గెరాల్డ్ కోయెట్జీ.
అఫ్గనిస్థాన్ – ముజీబ్ ఉర్ రెహ్మాన్.
బంగ్లాదేశ్ – ముస్తాఫిజుర్ రెహ్మాన్.
శ్రీలంక – ఏంజెలో మాథ్యూస్.
ఇవి కూడా చదవండి
-
Katrina Kaif | ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న కత్రినా కైఫ్
-
Kamal Nath | చేసింది చాలు ఇక దిగిపోండి.. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌ను కోరిన పార్టీ అధిష్ఠానం!
-
Pragya Jaiswal | ట్రెండీ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ అందచందాలు అదరహో..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

