ఢాకా : బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు అతడు బుధవారం సోషల్ మీడియా వేదికలలో తన నిర్ణయాన్నివెల్లడించాడు. 2007లో బంగ్లాదేశ్ జట్టులో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా.. సుదీర్ఘ కెరీర్లో 239 వన్డేలు ఆడి 5,689 పరుగులు చేశాడు. 50 టెస్టులు, 141 టీ20లలో ప్రాతినిధ్యం వహించిన మహ్మదుల్లా.. మూడు పార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు సాధించాడు.