Nikhat Zareen | ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (IBA Womens World Boxing Championship) లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) సంస్థ తమ కారు ‘థార్’ను (Mahindra Thar) బహుమతిగా అందించింది.
దీంతోపాటు ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ (Mahindra Emerging Boxing Icon) అవార్డునూ నిఖత్ గెలుచుకుంది. ‘ఎదురనేదే లేకుండా భారత క్రీడా చరిత్రలో నిఖత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌గా నిలిచిన నిఖత్‌కు అభినందనలు. ఆమె అద్భుతమైన ప్రతిభకు గాను కొత్త థార్ కారును అందిస్తున్నాం’ అని మహీంద్రా ఆటోమోటివ్ (Mahindra Automotive) ట్వీట్ చేసింది.
ఆదివారం జరిగిన 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకంతో పాటు సుమారు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్ ఖాతాలో చేరింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
The unstoppable @nikhat_zareen marks a new chapter in India's sporting history. Congratulations to the Mahindra Emerging Boxing Icon. A brand new All-New Thar is a token of our appreciation for her enormous achievement. #ItsHerTime #ExploreTheImpossible @BFI_official pic.twitter.com/oo8eHTNFTS
— Mahindra Automotive (@Mahindra_Auto) March 26, 2023
Also Read..
Daiabetes | ముప్పై ఏళ్లకే వస్తున్న డయాబెటిస్.. దీన్ని ఎలా నివారించాలి?
Hyderabad | రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం.. 9 మంది అరెస్టు