కింగ్స్టౌన్ : వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లా 27 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన 20 ఓవర్లలో 129-7 స్కోరు చేసింది. షమీమ్ (35 నాటౌట్), మెహదీహసన్(26) రాణించారు. గుడకేశ్ మోతీ (2-25) రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్..18.3 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. రోస్టన్ చేజ్ (32), హోసెన్ (31) ఆకట్టుకోగా, మిగతావారు విఫలమయ్యారు. తస్కిన్ అహ్మద్ (3-16) మూడు వికెట్లు తీయగా, మెహదీ, తంజిమ్, రిషాద్ రెండేసి వికెట్లు తీశారు. షమీమ్ హుస్సేన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.