T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ పోటీలకు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ (Italy) పెద్ద జట్లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మొదలవ్వనున్న మెగాటోర్నీ కోసం ఆ దేశ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. వెనే మ్యాడ్సెన్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఆదివారం సెలెక్టర్లు వెల్లడించారు. అయితే.. క్వాలిఫయర్స్‌లో ఇటలీని సమర్ధంగా నడిపించి.. ప్రపంచకప్ బెర్తు కట్టబెట్టిన జో బర్న్స్‌కు మాత్రం స్క్వాడ్‌లో చోటు దక్కలేదు.
మొదటిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న ఇటలీ పటిష్టమైన స్క్వాడ్‌తో వస్తోంది. భారత్, శ్రీలంక పరిస్థితులకు తగ్గట్టుగా.. కాంబినేషన్లను సరిచూసుకున్న ఇటలీ వెనే మ్యాడ్సెన్ నేతృత్వంలో వరల్డ్‌కప్ బరిలోకి దిగనుంది. ఆదివారం ప్రకటించిన స్క్వాడ్‌లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేజే స్మట్స్(JJ Smuts)కు చోటు దక్కింది. ఇక అన్నదమ్ములు హ్యారీ మనేటి, బెంజమిన్ మనేటిలను తీసుకున్నారు సెలెక్టర్లు.
Wayne Madsen has been named captain of Italy’s squad for the 2026 T20 World Cup. The 15-member squad also includes former South Africa international JJ Smuts, and two pairs of brothers, while there’s no place for Joe Burns, who led the team during their qualification campaign… pic.twitter.com/POzqDqUtxU
— ESPNcricinfo (@ESPNcricinfo) January 18, 2026
ఇటలీ స్క్వాడ్ : వెనే మ్యాడ్సెన్(కెప్టెన్), మార్కస్ కంపోపియానో(వికెట్ కీపర్), గియాన్ పీరో మీడె, జియాన్ అలీ, అలీ హసన్, క్రిషాన్ జార్జ్, హ్యారీ మనేటి, ఆంథోని మొస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మనేటి, జస్ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టెవార్ట్, థామస్ డ్రాకా,
ఐసీసీ నిర్వహించే ఒక్క ప్రపంచకప్ అయినా ఆడాలనుకున్న ఇటలీ కల త్వరలోనే సాకారం కానుంది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ సీలోని ఇటలీ ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం.. ఫిబ్రవరి 12న నేపాల్‌తో, ఫిబ్రవరి 16న ఇంగ్లండ్‌తో, ఫిబ్రవరి 19న వెస్టిండీస్‌తో మ్యాడ్సెన్ బృందం ఢీకొననుంది.