NZ vs AUS 1st Test : వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్(Newzealand) ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ లియాన్(Nathan Lyon) 4 వికెట్లు తీయడంతో కివీస్ పరుగులకే కుప్పకూలింది. దాంతో, ఆసీస్‌కు 203 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్ స్టీవ్ స్మిత్(0) వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ వేసిన మూడో బంతికే స్మిత్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్ క్రీజులో ఉన్నారు.
Matt Henry’s 34-ball 42 entertains; Australia do not enforce the follow-on
👉 https://t.co/xgMWgIb07R | #NZvAUS pic.twitter.com/fNwXgSTW1I
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024
తొలి ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్(174 నాటౌట్) సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. గ్రీన్, హేజిల్‌వుడ్(22)లు పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 116 రన్స్ జోడించారు. దాంతో, కమిన్స్ సేన 383 పరుగులు చేయగలిగింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టాడు.
Thirteen boundaries in Glenn Phillips’ third Test fifty – a superb counter-attack amid collapses
👉 https://t.co/xgMWgIb07R | #NZvAUS pic.twitter.com/feqt8MgKUU
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 29 పరుగులకే స్టార్ ఆటగాళ్లంతా డగౌట్‌కు చేరారు. చివర్లో వచ్చిన ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(71), మ్యాట్ హెన్రీ(42)లు ధనాధన్ ఆడడంతో కివీస్ స్కోర్ దాటింది. అయితే.. లియాన్ తన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను 179 పరుగులకే కట్టడి చేశాడు.