బెంగుళూరు: ఐపీఎల్లో బెంగుళూరుతో జరిగిన రసవత్తర పోరులో .. లక్నో(Lucknow Super Giants) జట్టు చివరి బంతికి అనూహ్య రీతిలో విక్టరీ కొట్టింది. భారీ స్కోర్ మ్యాచ్‌లో.. చివరి ఓవర్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) 212 రన్స్ చేసింది. అయితే భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో జట్టు.. చివరి ఓవర్లో అయిదు రన్స్ చేయాల్సి వచ్చింది. హర్షల్ పటేల్(Harshal Patel) వేసిన ఆ ఓవర్లో హైడ్రామా చోటుచేసుకున్నది.
Let's all laugh at @HarshalPatel23 🤣🤣🤣🤣🤣🤣. Man fumbled a mankad 😭😭😭😭😭. Ee sala cup nam de 🥶 🥶🥶🔥🔥🔥 pic.twitter.com/BAphDkHcRt
— V. (@Messilizer9021) April 10, 2023
మొదటి 5 బంతుల్లో వుడ్, ఉనద్కత్ ఔటయ్యారు. నాలుగు రన్స్ వచ్చాయి. అయితే చివరి బంతికి ఒక రన్ చేయాల్సి ఉంది. స్ట్రయికింగ్‌లో అవేశ్ ఖాన్, నాన్‌స్ట్రయికర్‌గా రవి బిష్ణోయ్ ఉన్నారు. ఆరో బంతిని వేస్తూ నాన్ స్ట్రయికర్ను ఔట్ చేయాలని హర్షల్ ప్రయత్నించాడు. బిష్ణోయ్ పరుగెత్తపోయాడు. కానీ హర్షల్ తొలుత వికెట్లను తాకడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత రనౌట్‌కు ప్రయత్నించాడు. అయితే ఆ అటెంప్ట్‌లో కూడా హర్షల్ సక్సెస్ కాలేదు.
Drama at the Chinnaswamy, a last-ball THRILLER 🤯#IPLonJioCinema #IPL2023 #TATAIPL #RCBvLSG | @LucknowIPL pic.twitter.com/AIpR9Q4gFB
— JioCinema (@JioCinema) April 10, 2023
నాన్ స్ట్రయికర్(Non Striker)ను ఔట్ చేయాలని ప్రయత్నించి అందులో సక్సెస్ కాకపోతే ఆ బంతిని మళ్లీ వేయాల్సిందే. ఇక చివరి బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లినా దినేశ్ దాన్ని సరిగా అందుకోలేకపోయాడు. ఈ లోపు అవేశ్ ఖాన్ ఒక పరుగు తీశాడు. ఆ ఉత్కంట పోరులో లక్నో గెయింట్స్ చివరి బంతికి విక్టరీ సాధించింది.
లక్నో గెలుపులో నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. పూరన్ వీరబాదుడు బాదాడు. అతను కేవలం 19 బంతుల్లో 62 రన్స్ చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. స్టోయినిస్ కూడా చెలరేగి ఆడాడు. అతను 30 బంతుల్లో 65 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి.