ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్! సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న రైజర్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్ షాక్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసిన హైదరాబాద్..లక్నో చేతిలో ఓటమిపాలైంది. శార్దుల్ ఠాకూర్ ధాటికి 190 పరుగులకు పరిమితమైన హైదరాబాద్..లక్నోను నిలువరించలేకపోయింది. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అర్ధసెంచరీలతో లక్నో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కెదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో లక్నో చేతిలో ఓడింది. తొలుత శార్దుల్ ఠాకూర్(4-34) ధాటికి రైజర్స్ 20 ఓవర్లలో 190-9 స్కోరు చేసింది. హెడ్(47), అనికేత్(36), నితీశ్‌కుమార్(32) రాణించారు. లక్ష్యఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 193-5 స్కోరు చేసింది. నికోలస్ పూరన్(26 బంతుల్లో 70, 6ఫోర్లు, 6సిక్స్‌లు), మార్ష్(31 బంతు ల్లో 52, 7ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. కమిన్స్(2-29) రెండు వికెట్లు తీశాడు. శార్దుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
పూరన్ వీరవిహారం: లక్ష్యఛేదనలో లక్నోకు మెరుగైన శుభారంభం దక్కలేదు. షమీ రెండో ఓవర్లోనే మార్క్మ్(్ర1).. కమిన్స్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పూరన్.. మార్ష్‌కు జతకలవడంతో అగ్నికి వాయువు తోడైనైట్టెంది. వీరిద్దరూ రైజర్స్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో ఉన్న పూరన్ అయితే పూనకమొచ్చినట్టు ఊగిపోయాడు. సిమర్జీత్ 3వ ఓవర్లో ఓ ఫోర్, రెండు సిక్స్‌లతో 17 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో మిచెల్ కూడా సిక్స్‌లు బాదడంతో లక్నో లక్ష్యం వైపు సాఫీగా సాగింది.
అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకున్న మార్ష్ ఒక ఫోర్ కొడితే పూరన్ రెండు సిక్స్‌లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. సిక్స్‌తో 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పూరన్.. అదే ఊపులో సిక్స్, ఫోర్ దంచాడు. ఇన్నింగ్స్ టాప్‌గేర్‌లో దూసుకెళుతున్న సమయంలో బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్.. పూరన్‌ను ఎల్బీ చేసి రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు. తన తర్వాతి ఓవర్లో కమిన్స్.. మార్ష్‌నూ పెవిలియన్‌కు పంపాడు. కానీ అప్పటికే లక్నో విజయం దాదాపు ఖాయమైంది. బదోని (6), పంత్ (15) వెనుదిరిగినా గత సీజన్ దాకా హైదరాబాద్‌కు ఆడిన అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ ( 13 నాటౌట్) అండతో లక్నోను విజయతీరాలకు చేర్చాడు.
రాణించిన హెడ్, అనికేత్: తొలుత టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆతిథ్య జట్టు ఫామ్ చూస్తే ఎవరూ చేయని సాహసం పంత్ చేశాడని అంతా భావించారు. కానీ తమ బౌలర్లపై నమ్మకం పెట్టుకున్న పంత్.. హైదరాబాద్‌ను ఆదిలోనే దెబ్బతీయడంలో సఫలమయ్యాడు. మొదటి నుంచే బౌలర్లపై తనదైన శైలిలో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే అభిషేక్‌శర్మ(6)ను శార్దుల్ తొలి వికెట్‌గా సాగనంపాడు. ఆ మరుసటి బంతికే గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డకౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెడ్, నితీశ్‌కుమార్ జట్టును ఆదుకున్నారు.
అవేశ్‌ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో హెడ్ రెండు భారీ సిక్స్‌లకు తోడు ఫోర్‌తో గేర్ మార్చాడు. రెండుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ 8వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేయడంతో 61 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి ఇన్నింగ్స్ ఒకింత మందగించింది. ప్రిన్స్ 12వ ఓవర్ చివరి బంతికి షాట్ ఆడిన నితీశ్ బంతి బౌలర్ చేతికి తగిలి వికెట్లను గిరాటేయడడంతో క్లాసెన్(26) వెనుదిరుగాల్సి వచ్చింది. మరోమారు బౌలింగ్ వచ్చిన బిష్ణోయ్..నితీశ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో రైజర్స్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా..అనికేత్‌వర్మ రెండు భారీ సిక్స్‌లతో ఇన్నింగ్స్ ఊపు తీసుకొచ్చాడు. ఇదే దూకుడుతో దిగ్వేశ్‌ను రెండు సిక్స్‌లు అరుసుకున్న అనికేత్..మిల్లర్ చేతికి చిక్కాడు. అభినవ్ మనోహర్ (2) మరోమారు నిరాశపర్చగా, ఆఖర్లో కెప్టెన్ కమిన్స్(18) హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగగా రైజర్స్ స్కోరుకు కీలక పరుగులు జతకలిశాయి. హర్షల్(12), సిమర్జిత్సింగ్(3) నాటౌట్‌గా నిలిచారు.
హైదరాబాద్: 20 ఓవర్లలో 190-9(హెడ్ 47, అనికేత్ 36, శార్దుల్ 4-34, ప్రిన్స్ యాదవ్ 1-29), లక్నో: 16.1 ఓవర్లలో 193/5 (పూరన్ 70, మార్ష్ 52, కమిన్స్ 2/29, హర్షల్ 1/28)