LSG vs GT | ఐపీఎల్లో ఇవాళ కొత్త జట్ల సందడి నెలకొన్నది. లక్నో, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ నాలుగో మ్యాచ్లో లక్నో పవర్ ప్లే ముగిసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లకు లక్నో.. 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదటి బంతికే డక్ అవుట్ అయిన విషయం తెలిసిందే. డికాక్ కూడా 9 బంతుల్లో 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. లెవిస్ 9 బంతుల్లో 10 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. మనిష్ పాండే కూడా 5 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా, ఆయుష్ బరిలో ఉన్నారు.
ICYMI – Shami's first ball WICKET!
WATCH 📽️📽️https://t.co/FHWVM1tcK9 #TATAIPL #GTvLSG pic.twitter.com/7cuWREDIfS
— IndianPremierLeague (@IPL) March 28, 2022