IPL 2026 : ఐపీఎల్ కొత్త సీజన్ ముందే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తమ కోచింగ్ బలాన్ని పెంచుకుంటోంది. ఇప్పటికే కేన్ విలియమ్సన్ (Kane Williamson)కు వ్యూహాత్మక సలహాదారుగా, టామ్ మూడీ (Tom Moody)కి ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ (Global Director Of Cricket)గా కీలక బాధ్యతలు అప్పగించిన లక్నో.. తాజాగా స్పిన్ బౌలింగ్ కోచ్‌ను నియమించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా అద్భుత ఫలితాలు సాధించిన కార్ల్ క్రొవే (Carl Crowe)ను తమ గూటికి తెచ్చుకుంది సంజీవ్ గొయెంకా టీమ్.
నాలుగు సీజన్లుగా కప్ కోసం నిరీక్షిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకుంటోంది. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో దిగ్గజాలకు కీలక పదవులు కట్టబెట్టిన లక్నో ఈసారి టీ20 స్పిన్ స్పెషలిస్ట్‌ను తీసుకుంది. ఇంగ్లండ్ వెటరన్ అయిన కార్ల్ క్రొవేను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని తమ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
A fresh spin to the Super Giants story 👀
Welcome aboard, Carl Crowe 💙 pic.twitter.com/u9icx6zo6h
— Durban’s Super Giants (@DurbansSG) November 25, 2025
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్లకు శిక్షణ ఇచ్చిన క్రొవేకు.. బిగ్‌బాష్ లీగ్‌లో, గ్లోబల్ టీ20లోనూ పనిచేసిన అనుభవముంది. అయితే.. 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రొవే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మాత్రం ఒక్కమ్యాచ్ కూడా ఆడలేదు. క్రొవే కోచింగ్ స్టయిల్ కాస్త విభిన్నంగా ఉంటుంది. నెట్స్‌లో అతడు వే ఒక్కోసారి బౌలర్లను ఉద్దేశపూర్వకంగానే చెత్త బంతులు వేయమంటాడు. ఒత్తిడిలో ఈ బ్యాడ్ బాల్ ఫార్ములా గొప్పగా పనిచేస్తుందంటాడు క్రొవే. అందుకు.. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) కొన్నిసార్లు కావాలనే వైడ్స్ వేస్తుంటాడు. ఆ తర్వాత సరైన బంతితో అతడు బ్యాటర్లను ఔట్ చేయడం చూశాం.
Tezi bhi, Junoon bhi, ab Shami bhai pe LSG ka rang bhi 🩵 pic.twitter.com/e5Nko7hDEo
— Lucknow Super Giants (@LucknowIPL) November 15, 2025
ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. వరుసగా రెండుసీజన్లు ప్లే ఆఫ్స్ చేరిన ఎల్ఎస్జీ.. 17, 18వ సీజన్లలో నాకౌట్ దశకు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో.. అశించిన ఫలితాన్ని మాత్రం చూడలేదు. పంత్ సారథ్యంలోని ఆ జట్టు మొదట విజయాలతో అదరగొట్టింది. కానీ, చివరకు ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరలేదు. డిసెంబర్ 16న అబుధాబీలో మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
లక్నో రీటైన్డ్ ప్లేయర్లు – రిషభ్ పంత్, మర్క్రమ్, హిమ్మత్, అర్జున్ టెండూల్కర్, షమీ (ట్రేడ్ డీల్), ఆయుశ్ బదొని,మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాద్, అర్షిన్, అవేశ్, సిద్ధార్థ్, దిగ్వేజ్, ప్రిన్స్, మయాంక్ , మొహ్సిన్.
లక్నో విడుదల చేసిన ప్లేయర్లు – రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమర్ జోసెఫ్, ఆర్యన్ జుయల్, హంగర్కేకర్, యువరాజ్ చౌదరీ.
పంతొమ్మిదో సీజన్ కోసం పది జట్లు 173 మందిని అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇటీవలే ట్రేడ్ పద్ధతిలో సన్‌రైజర్స్ నుంచి రూ.10 కోట్లకు సీనియర్ పేసర్ షమీని దక్కించుకున్న లక్నో.. ముంబై ఇండియన్స్‌కు శార్ధూల్ ఠాకూర్‌ను అమ్మేసింది. ఆ ఫ్రాంచైజీ నుంచి అర్జున్ టెండూల్కర్‌ను రూ.30 లక్షలకు తీసుకుంది.