అడిలైడ్: తాజా ప్రపంచకప్‌లో అదృష్టం అంటే పాకిస్థాన్‌దే అనాలేమో! తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన పాక్.. ఆ తర్వాత జింబాబ్వే చేతిలోనూ పరాజయం పాలవడంతో.. ఇక ఆ జట్టు సెమీస్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. మాజీలు, విశ్లేషకులు, అభిమానులు ఇలా ప్రతి ఒక్కరినీ తమ ప్రదర్శనతో నిరాశ పరిచిన పాకిస్థాన్‌కు.. అదృష్టం నెదర్లాండ్స్ రూపంలో కలిసొచ్చింది. ఆదివారం తొలి పోరులో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ నెగ్గడంతో అనూహ్యంగా పాక్ సెమీస్ రేసులోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నెగ్గితే సెమీస్ చేరే చాన్స్ రావడంతో సమరోత్సాహంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 127 రన్స్ చేసింది. నజ్ముల్ (54) టాప్ స్కోరర్ కాగా.. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది.