లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తడబడుతోంది. తొలి ఓవర్లోనే దుష్మంత చమీర దెబ్బకు వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరును ఆరో ఓవర్లో కృనాల్ పాండ్యా మరో దెబ్బ కొట్టాడు. అనూజ్ రావత్ (4), విరాట్ కోహ్లీ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరును ఆదుకున్నట్లే కనిపించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23)ను కృనాల్ అవుట్ చేశాడు.
అతను వేసిన బంతిని మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ చేశాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హోల్డర్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ (15 నాటౌట్), సూయష్ ప్రభుదేశాయి (2 నాటౌట్) ఉన్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి బెంగళూరు జట్టు మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.
The Maxwell dismissal in images 📸📸#TATAIPL #LSGvRCB pic.twitter.com/FEZxEskzCu
— IndianPremierLeague (@IPL) April 19, 2022