లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై వెటరన్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు. 12వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఆ ఓవర్ ఐదో బంతికి మనీష్ పాండేను వెనక్కు పంపాడు. 22 బంతుల్లో 22 పరుగులు చేసిన పాండే.. పొలార్డ్ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మెరెడిత్ వైపు వెళ్లింది. అతన్ను దాన్ని చాలా కంఫర్టబుల్గా అందుకోవడంతో పాండే పెవిలియన్ చేరాడు.