వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న అతను.. మ్యాచ్ తొలి బంతికే సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత మరోసారి మూడో ఓవర్లో బంతి అందుకున్నాడు. తొలి బంతికి బౌండరీ బాదిన క్వింటన్ డీకాక్ (7)ను మూడో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు.
షమీ బౌలింగ్‌తో గుజరాత్ అభిమానులు కేరింతల్లో మునిగిపోయారు. షమీ వేసిన ఫుల్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడేందుకు డీకాక్ ప్రయత్నించాడు. కానీ అతను మిస్ అవడంతో బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లిన బంతి మిడ్వికెట్ను కూల్చింది. దాంతో గుజరాత్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.