Shoaib Akhtar | పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు తనే.. బాబర్ వారసుడుగా అతనే సరైనోడు : అక్తర్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈమధ్యే యూట్యూబ్ ఛానెల్లో పాక్ క్రికెటర్లకు ఇంగ్లీష్ అంతగా రాదని వివాదానికి తెరలేపిన అతను ఈసారి పాక్ భావి కెప్టెన్ పేరు సూచించాడు. బాబర్ ఆజాం తర్వాత ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ వన్డే , టీ20ల్ కెప్టెన్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Shoaib Akhtar : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈమధ్యే సొంత యూట్యూబ్ ఛానెల్లో పాక్ క్రికెటర్లకు ఇంగ్లీష్ అంతగా రాదని వివాదానికి తెరలేపిన అతను ఈసారి పాక్ భావి కెప్టెన్ పేరును సూచించాడు. పాకిస్థాన్ తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. బాబర్ ఆజాం తర్వాత వన్డేలు, టీ20ల్లో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కెప్టెన్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్రికెట్ పాకిస్థాన్‌తో మాట్లాడిన అక్తర్.. ‘షాదాబ్ చాలా తెలివైనవాడు. అతని క్రికెట్ నైపుణ్యం అద్భుతం. బాగా బౌలింగ్ చేసేందుకు షాదాబ్ చాలా కష్టపడతాడు. అంతేకాదు అతని ఫిట్నెస్ కూడా మెరుగు పడింది. అతను చక్కగా కనిపించాలి అనుకుంటాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. అద్భుతంగా మాట్లాడతాడు’ అని అన్నాడు.
వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు
ఆస్ట్రేలియాలో పోయిన ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు పొట్టి ప్రపంచకప్‌లో అత్యధికంగా 98 వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్‌గా షాదాబ్ ఖాన్ రికార్డు సాధించాడు. మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీదీ (97 వికెట్లు) రికార్డును బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్‌లో అతను ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకి కెప్టెన్. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన షాదాబ్ 6 టెస్టులు, 53 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.
వరుస ఓటములతో..
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన బాబర్ ఆజాం 2020లో పాకిస్థాన్ కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి అతను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో పాక్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. పోయిన ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న బాబర్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. అయితే.. స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయింది. సొంతగడ్డపై వరుస ఓటములతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. దాంతో, బాబర్‌ను టెస్టు, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్తర్, షాదాబ్ ఖాన్ పేరు సూచించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
Tim Southee | టెస్టుల్లో ధోనీ రికార్డు సమం చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ సౌథీ
Ravichandran Ashwin | మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించారేంటి?.. ఫ్యాన్ ప్రశ్నకు అశ్విన్ ఏం చెప్పాడంటే?
Ishant Sharma | ఆ మ్యాచ్ తర్వాత నెలంతా బాధపడ్డా.. నా భార్యకు రోజూ ఫోన్ చేసి ఏడ్చా : ఇషాంత్ శర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

