Lionel Messi | మెస్సీ వరల్డ్ కప్ జెర్సీలకు రికార్డు ధర.. ఆరు జెర్సీలకు అన్ని కోట్లా ?
Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) నిరుడు ఖతర్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఏండ్లుగా వెంటాడుతున్న తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. తన ఆటతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ తాజాగా వరల్డ్ కప్ జెర్సీ(World Cup Jersey)లను...
Lionel Messi : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) నిరుడు ఖతర్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఏండ్లుగా వెంటాడుతున్న తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. తన ఆటతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ తాజాగా వరల్డ్ కప్ జెర్సీ(World Cup Jersey)లను వేలం వేశాడు. 2022 వరల్డ్ కప్‌లో మెస్సీ ధరించిన ఆరు 10 వ నంబర్ జెర్సీలను వేలం వేయగా రూ.64 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు మెస్సీ వెల్లడించాడు.
అర్జెంటీనాకు చెందిన సోత్‌బైస్ అనే కంపెనీ మెస్సీ వరల్డ్ కప్ జెర్సీలను వేలం వేసింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ ధరించిన జెర్సీతో కలిపి అతడు ఆ టోర్నీలో వేసుకున్నఆరు జెర్సీలకు రూ. 76 కోట్ల కనీస ధర నిర్ణయించింది. కానీ, రూ.64 కోట్లు మాత్రమే వచ్చాయి. జెర్సీల వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తున్నయునికాస్ ప్రాజెక్ట్(Unicas Project)కు మెస్సీ డొనేట్ చేయనున్నాడు.
వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ

నిరుడు ఖతర్‌లోని లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు ఆ రోజుతో 35 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది. వరల్డ్ కప్ అనంతరం పీఎస్జీ క్లబ్‌ను వీడిన మెస్సీ అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. మేజర్ సారగ్ లీగ్‌లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న మెస్సీని ప్రతిష్ఠాత్మక ‘బాలన్ డీ ఓర్'(Ballon d’Or) అవార్డు వరించింది. అతడు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి
- ITF | ట్రోఫీల పంట పండించి.. ‘వరల్డ్ చాంపియన్ అవార్డు’ కొల్లగొట్టిన జకోవిచ్, సబలెంక
- Leopard | కామారెడ్డిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి
- Hungary: ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల పౌండ్ల సాయాన్ని అడ్డుకున్న హంగేరి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

