Lionel Messi | ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగాం.. ఒత్తిడిని ఎలా అధిగమిస్తామంటే..!
Lionel Messi : న్యూ జెర్సీలో బిగ్ ఫైట్‌కు ముందు.. మెస్సీ మైదానంలో ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) అడిగిన పలు ప్రశ్నలకు ఓ మానసిక నిపుణుడిలా బదులిచ్చాడీ దిగ్గజం.
Lionel Messi : వరసగా రెండోసారి అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు ఆడుతోంది. నాలుగేళ్ల క్రితం తన సారథ్యంలో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్ ముద్దాడిన దక్షిణ అమెరికా జట్టును ఈసారి విజేతగా నిలపాలని లియోనల్ మెస్సీ (Lionel Messi) భావిస్తున్నాడు. ఆదివారం న్యూ జెర్సీలో బిగ్ ఫైట్‌కు ముందు.. మెస్సీ మైదానంలో ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) అడిగిన పలు ప్రశ్నలకు ఓ మానసిక నిపుణుడిలా బదులిచ్చాడీ దిగ్గజం. జట్టుగా మీరంతా ఒత్తిడిని ఎలా జయిస్తారు? విమర్శలకు ఎలా చెక్ పెడతారు? అనే సవాళ్లకు నా ఆటతోనే అని మెస్సీ చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది.
ఫిఫా వరల్డ్‌కప్ అంతిమ సమరానికి ఒక్కరోజే ఉంది. వరసగా రెండోసారి ట్రోఫీపై కన్నేసిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్‌కు చెక్ పెట్టాలనే కసితో ఉంది. ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమవ్వగా.. ఈ హైఓల్టేజ్ ఫైట్‌కు ముందు ఒక ఈవెంట్లో లియోనల్ మెస్సీ అభిమానుల మనసులు దోచుకున్నాడు. మన్హట్టన్లో జరిగిన ‘ది ఫంటాస్టిక్స్ ఫెస్ట్’లో అర్జెంటీనా ఆటగాళ్లు పాల్గొనగా.. టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ మెస్సీని ప్రశ్నించాడు.
నాకౌట్(రౌండ్ 32, రౌండర్ 16,)లో ప్రత్యర్థి ఆధిక్యంలో ఉన్నా సరే.. అద్భుతంగా పుంజుకొన్న తీరును ప్రశంసిస్తూ మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు? విమర్శలకు ఎలా ముగింపు పలుకుతారు? అని జకో అడుగాడు. అందుకు మెస్సీ తమకు ఒత్తిడి అనే మాటే తెలియదని చెప్పాడు.
When the legend speaks, we listen 😌 pic.twitter.com/m5uXsqpyQA
— Fanatics (@Fanatics) July 18, 2026
‘నేను ఇదివరకు చెప్పినట్టు మేమంతా ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగాం. మాకు ఈ ఆటంటే ప్రాణం. జాతీయ జట్టుకు ఆడాలి, ఆటను ఆస్వాదించాలి అనే బలమైన కోరిక మాలో ఉండేది. స్కూల్లో, వీధుల్లో.. జట్టుతోనూ మేము ఎంతో ఇష్టంగా ఫుట్‌బాల్ ఆడేవాళ్లం. మా దేశంలోని క్లబ్ జట్లకు ఆడినప్పుడు కూడా మేము ఒత్తిడి గురించి ఆలోచించేవాళ్లం కాదు. మైదానంలో ఆటపై దృష్టి సారించడం, ప్రత్యర్థితో పోటీపడడం ఇవే మాకు తెలుసు. మేము పోటీదారులం. అదే మంత్రతో విజయాలు సాధిస్తున్నాం.
Lionel Messi exchanged handshakes with Rio Ferdinand and Kevin Hart ahead of the FIFA World Cup Final Fest.
Just look at Kevin Hart’s reaction after hugging Messi. 🐐❤️ pic.twitter.com/B1YwcnCm26
— MC (@CrewsMat10) July 17, 2026
రెండు జట్లు తలపడుతున్నప్పుడు ప్రతిసారి మనదే పైచేయి అవ్వదు. ఈ విషయాన్ని చిన్నతనంలోనే నేర్చుకున్నా. మరో విషయం.. మనం ప్రతిసారి గెలవం అనేది గ్రహించాను. ఆటలో దాగున్న ఈ నిజం తెలిశాక వ్యక్తిగా, ఆటగాడిగా నేను మెరుగయ్యాను’ అని మెస్సీ చాలా సరళంగా, స్పష్పంగా చెప్పడంతో అభిమానులంతా ‘వావ్’.. అని చప్పట్లు కొట్టారు.
దిగ్గజాలతో సెల్ఫీ..
అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లో అర్జెంటీనా ఆగాళ్లు సందడి చేశారు. అమెరికా ఫుట్‌బాల్ దిగ్గజం టామ్ బ్రాడీ, ఎన్బీఏ ఐకాన్ కెవిన్ డురంట్.. పలువురితో మెస్సీ ముచ్చటించి సెల్ఫీలు దిగాడు. వరల్డ్‌కప్ అంటే గోల్స్‌తో చెలరేగే మెస్సీ.. ఈసారి 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు రేసులో ముందున్నాడు.
Selfie yang sangat ikonik di acara Fanatics jelang final. 📸
• Rodri (timnas Spanyol)
• Tom Brady (ex pemain American football)
• Novak Djokovic (petenis)
• Kevin Durant (pemain basket)
• Emiliano Martínez (timnas Argentina)
• Kevin Hart (komedian & aktor)
• Travis Scott… pic.twitter.com/ATg4EXOJ6W— FaktaBola (@FaktaSepakbola) July 18, 2026
ఆదివారం ఫైనల్లో స్పెయిన్‌పై మెస్సీ మరో గోల్ కొడితే అవార్డు అతడికే దక్కనుంది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే సైతం 8 గోల్స్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో.. గోల్డెన్ బూట్ ఎవరికి దక్కనుంది? అనేది ఆసక్తి రేపుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

