Lionel Messi | మెస్సీ మరో వరల్డ్ కప్ ఆడతాడా..? అతడి మనసులో ఏముంది..?
Lionel Messi : ఫుట్‌బాల్ లెజెండ్ లియెనల్ మెస్సీ(Lionel Messi) ఈ ఏడాది పిచ్చ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యే ఎనిమిదోసారి ప్రతిష్ఠాత్మక బాలన్ డి ఓర్(Ballon d'Or) అవార్డు గెలిచిన మెస్సీ.. నిరుడు అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపిన మెస్సీ.. మేజర్ సాకర్ లీగ్‌లో ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ తరఫున ఇరగదీస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్యే వరల్డ్ కప్ క్వాలిఫయర్(World Cup Qualifier 2026)లో...
Lionel Messi : ఫుట్‌బాల్ లెజెండ్ లియెనల్ మెస్సీ (Lionel Messi) ఈ ఏడాది పిచ్చ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యే ఎనిమిదోసారి ప్రతిష్ఠాత్మక బాలన్ డి ఓర్(Ballon d’Or) అవార్డు గెలిచిన మెస్సీ.. నిరుడు అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపిన మెస్సీ.. మేజర్ సాకర్ లీగ్‌లో ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్ తరఫున ఇరగదీస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్యే వరల్డ్ కప్ క్వాలిఫయర్(World Cup Qualifier 2026)లో మెస్సీ సత్తా చాటాడు.
అయితే.. వచ్చే ప్రపంచ కప్ టోర్నీకి మరో రెండేండ్ల సమయం ఉంది. అప్పటికీ అతడికి 39 ఏండ్లు వస్తాయి. దాంతో, మెస్సీ 2026 వరల్డ్ కప్ ఆడాతాడా? లేదా? అని అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకు ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ మనసులో ఏముందో తెలుసా..? కోపా అమెరికా(Copa America) కప్. అవును మెస్సీ తొలి ప్రాధాన్యం కోపా అమెరికా కప్ నిలబెట్టుకోవడం మీదనే ఉందట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
లియెనల్ మెస్సీ

నేను బాగా ఉన్నంత కాలం ఆడుతూనే ఉంటా. అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను. ఇప్పటికైతే నా ఫోకసంతా కోపా అమెరికా కప్ మీదే. ఆ తర్వాత నేను వరల్డ్ కప్ ఆడతానా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే..? అప్పటికీ నాకు 39 ఏండ్లు వస్తాయి. ఆ వయసులో ప్రపంచ కప్ ఆడడం సాధ్యం కాకపోవచ్చు. 2022 వరల్డ్ కప్ గెలిచాక ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నా. కానీ, ఇప్పుడు మరికొన్నాళ్లు జట్టుతో కొనసాగాలని ఉంది. ప్రస్తుతం మేమంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. అందుకని వచ్చే రెండు, మూడు ఏండ్ల గురించి నేను ఆలోచించడం లేదు అని మెస్సీ వెల్లడించాడు.
కోపా అమెరికా(2021) ట్రోఫీతో మెస్సీ బృందం

మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా మూడుసార్లు కోపా అమెరికా ఫైనల్లో భంగపడింది. వరుసగా 2014, 2015, 2016లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అయితే.. 2021లో మాత్రం మెస్సీ బృందం చాంపియన్‌గా నిలిచింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 పోటీలకు అమెరికా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. నిరుడు ఖతార్‌లో ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై షూటౌట్లో 4-2తో గెలుపొందిన అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Extra Ordinary Man | ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుంచి ‘ఒలే ఒలే పాపాయి’ మాస్ డ్యాన్స్ ప్రోమో రిలీజ్
-
Spirit Of Cricket | వీళ్ల ‘క్రీడా స్ఫూర్తి’కి హ్యాట్యాఫ్.. అసలేం జరిగిందంటే?
-
Telangana | ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

