Bula Chowdhury : స్విమ్మింగ్ క్వీన్ బులా చౌదరీ (Bula Chowdhury) ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం అందజేసిన పలు అవార్డులను ఎత్తుకెళ్లారు. ఇంటి వెనక తలుపు పగలగొట్టిన దొంగలు నాలుగోసారి ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. విలువైన వస్తువులతో పాటు పద్మ శ్రీ, రాష్ట్రపతి అవార్డులను తీసుకెళ్లిపోయారు. ఈతకొలనులో మెరిసి ఆమె సాధించిన పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కాజేశారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కోల్‌కతాలో నివసించే బులా హుగ్లీ సమీపంలో ఉన్న హిండ్మోటార్లోని తమ పూర్వీకుల ఇంటికి తరచూ వెళ్తుంటుంది. అయితే.. శుక్రవారం ఆమెకు చెందిన ఇంట్లో దొంగతనం జరిగిందని సోదరుడు డొలాన్ చౌదరీ ఆమెకు చెప్పాడు. ఇప్పటికే మూడుసార్లు చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొన్నిరోజులు ఇంటి సమీపంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాళ్లు పట్టించుకోలేదు. తాజాగా మరోమారు దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల వైఫల్యంతోనే దొంగలు రెచ్చిపోతున్నారు అని డొలాన్, బులా ఆరోపించారు. దొంగతనం వార్త తెలియగానే నార్త్ ఉత్తరపర పోలీసులు బులా ఇంటికి చేరుకున్నారు.
সাঁতারু বুলা চৌধুরীর বাড়িতে দুঃসাহসিক চুরি, কী কী মূল্যবান জিনিস খোয়া গেল?#bulachoudhury #westbengalhttps://t.co/BqAtiCNjJ2
— Aaj Tak Bangla (@AajTakBangla) August 15, 2025
స్విమ్మర్‌గా ఎన్నో రికార్డులు నెలకొల్సిన బులా 1970లో హుగ్లీలో జన్మించింది. చిన్న వయసు నుంచే ఈతపై ఆసక్తి పెంచుకున్న ఆమె తొమ్మిదేళ్లకే జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పన్నేండేళ్లు వచ్చే సరికి సీనియర్ లెవల్ పోటీలకు అర్హత సాధించింది బులా. ఈత కొలనులో చేప పిల్లలా దూసుకెళ్లే ఆమె 1982 కామన్వెల్త్ పోటీల్లో రీలే టీమ్‌కు ఎంపికైంది. 2005లో ఐదు ఖండాల్లోని సుముద్రాల్లో ఈదిన బులా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆమె ప్రతిభకు పట్టం కడుతూ భారత ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మ శ్రీతో పాటు రాష్ట్రపతి పురస్కరాన్ని అందజేసింది.