Lakshya Sen : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్(Badminton World Championships)లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను దక్షిణ కొరియా ఆటగాడు జియాన్ హైయక్ జిన్(Jeon Hyeok-jin)పై గెలుపొందాడు. 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 11వ సీడ్ లక్ష్య సేన్ రఫ్ఫాడించాడు.
అద్భుతమైన స్మాష్‌లు, నెట్ వద్ద చురకుగా కదిలిన అతను 21-11, 21-12తో అవలీలగా విజయం సాధించాడు. దాంతో, నిరుడు ఆసియన్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో జియాన్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు.
Just in:
🏸 Lakshya Sen storms into Pre-QF of World Championships.
🏸 Lakshya got the better of WR 51 Jeon Hyeok Jin 21-11, 21-12 in 2nd round.
🏸 The Korean shuttler had defeated Lakshya in Asian Team Championships last year! #Copenhagen2023 pic.twitter.com/VVBAaWodUU— India_AllSports (@India_AllSports) August 22, 2023
ఈ సీజన్లో లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. కెనడా ఓపెన్(Canada Open 2023) చాంపియన్‌గా నిలిచిన అతను థాయ్‌లాండ్, మలేషియా మాస్టర్స్‌లోనూ చక్కని ప్రదర్శన చేశాడు. కొపెన్‌హగన్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ మూడో రౌండ్‌కు చేరి పతకం ఆశలు రేపుతున్నాడు. ఈ టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కిదాంబిశ్రీకాంత్(Kidambi Srikanth) మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి, రోహన్ కపూర్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.