జకర్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా కిరణ్ జార్జి, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి ద్వయం రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
లక్ష్యసేన్.. 21-12, 21-17తో త్సునెయమను ఓడించగా రజావత్.. 21-17, 21-12తో ప్రణయ్‌ను చిత్తుచేశాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి జంట.. 21-15, 21-11 తో యు పి చెంగ్-యు పి హ్సింగ్ సన్ను మట్టికరిపించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి- సిక్కి రెడ్డి.. 18-21, 21-16, 21-17తో విన్సన్ చివు – జెన్నీ గయ్ (అమెరికా)పై విజయం సాధించారు.