పారిస్ : భారత షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen).. పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ స్టేజ్‌లో రెండో మ్యాచ్‌లో విజయం సాధించాడు. జులియన్ కర్రాగ్గిపై అతను వరుస సెట్లలో గెలుపొందాడు. 52 వరల్డ్ ర్యాంక్ ప్లేయర్ జులియన్పై 21-19, 21-14 స్కోరుతో లక్ష్యసేన్ విక్టరీ నమోదు చేశాడు. తొలి సెట్లో సేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఓ దశలో ప్రత్యర్థి ముందంజలో ఉన్నాడు. కానీ పుంజుకున్న లక్ష్యసేన్.. ఆ సెట్‌ను స్వల్ప తేడాతో కైవసం చేసుకున్నాడు. ఇక రెండవ సెట్లో దూకుడుమీదున్న సేన్.. ఈజీగానే ఆ సెట్‌ను వశం చేసుకున్నాడు. తన తర్వాత మ్యాచ్‌లో జోనాథన్ క్రిస్టీతో సేన్ తలపడనున్నాడు.
News Flash: Lakshya Sen BEAT Julien Carraggi (WR 52) 21-19, 21-14 in his 2nd Group stage match. #Badminton #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/N8VttqcqSM
— India_AllSports (@India_AllSports) July 29, 2024