Marnus Labuschagne : ఒకప్పుడు వరల్డ్ నంబర్ వన్‌గా, ఆస్ట్రేలియా ప్రధాన బ్యాటర్‌గా వెలుగొందని మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఇప్పుడు జట్టులో చోటుకోసం నిరీక్షిస్తున్నాడు. యాషెస్ హీరో(Ashes Hero)గా.. టెస్టు స్పెషలిస్ట్‌గా ఆసీస్ విజయాల్లో కీలకమైన మార్నస్.. ఈసారి ఓపెనర్ స్థానం ఆశిస్తున్నాడు. డేవిడ్ వార్నర్(David Warner) వీడ్కోలు తర్వాత అతడిలా శుభారంభాలు ఇచ్చే బ్యాటర్ కరువయ్యాడు. ఓపెనర్‌గా రాణించడంలో సామ్ కొన్‌స్టాస్, మెక్ స్వీనే వంటి కుర్రాళ్లు తేలిపోతున్న వేళ.. అవకాశం ఇస్తే తాను ఉస్మాన్ ఖవాజాకు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభిస్తానని అంటున్నాడు లబూషేన్.
ఫామ్ లేమితో తంటాలు పడుతున్న లబూషేన్ పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కోచ్‌ల సమక్షంలో తన లోపాలను సరి చేసుకుంటున్న ఈ స్టార్ ప్లేయర్ తనవై వస్తున్న విమర్శులను పట్టించుకోనని అంటున్నాడు. ‘ఫామ్ లేమి అనేది ఆటలో భాగం. నన్ను తక్కువగా అంచనా వేస్తున్న వాళ్ల సందేహాలను నివృత్తి చేయాల్సిన టైమ్ వచ్చేస్తోంది. వెస్టిండీస్ సిరీస్‌కు దూరమవ్వడంతో నేను నా ఆటపై దృష్టి సారించాను.
Marnus Labuschagne is ready to turn into an opener if it means he could return to the Australia Test setup.
READ: https://t.co/JJOW8QBAfp pic.twitter.com/280YbLzPM1
— Sportstar (@sportstarweb) August 10, 2025
నా కెరీర్లో చాలా వరకూ మూడో స్థానంలోనే ఆడాను. కానీ, ఇప్పుడు అదే ఆర్డర్ దక్కడం సందేహమే. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సిద్ధమే. అది ఓపెనర్ ప్లేస్ అయినా ఇష్టంగా స్వీకరిస్తాను. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఖవాజాతో ఇన్నింగ్స్ ఆరంభించాను. రెండు ఇన్నింగ్స్‌ల్లో చక్కగా ఆడాను’ అని లబూషేన్ తెలిపాడు. ఈ ఏడాది నవంబర్ చివర్లో ఆసీస్ జట్టు యాషెస్ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆలోపు జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడీ బ్యాటర్.
యాషెస్ హీరోగా లబూషేన్ తన కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. 2018 అక్టోబర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లబూషేన్ జీవితం 2019లో టర్న్ అయింది. ఆ ఏడాది యాషెస్ సిరీస్(Ashes Series)లో ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన అతడు నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా 353 పరుగులతో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో, మూడో స్థానంలో పాతుకుపోయిన అతడు ఆ తర్వాత ఆడిన 12 మ్యాచుల్లో 1,591 పరుగులు సాధించాడు. 2021-22 పర్యటనలోనూ లబూషేన్ పరుగుల వరద పారించాడు. రెండు ఫిఫ్టీలు, ఒక సెంచరీతో కలిపి 335 రన్స్ కొట్టాడు.
Edged and GONE!
Chris Woakes gets Marnus Labuschagne for 21 🙌 #EnglandCricket | #Ashes pic.twitter.com/gxpOn9qOcB
— England Cricket (@englandcricket) July 6, 2023
టెస్టుల్లో రికార్డులు బద్ధలు కొట్టిన లబూషేన్ 2020లో వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. నిరుడు వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు పేలవ ఫామ్‌లో ఉన్న అతడిని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. స్పిన్నర్ డీన్ ఎల్గర్ గాయపడడంతో స్క్వాడ్‌లో అతడికి చోటు దక్కింది. దాంతో, లబూషేన్ పలు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్ విజయాల్లో భాగమయ్యాడు. టీమిండియాతో జరిగిన ఫైనల్లో లబూషేన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. షమీ విజృంభణతో 47 రన్స్‌కే మూడు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన అతడు ఓపెనర్ ట్రావిస్ హెడ్(137)కు అండగా నిలిచాడు. 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాను గెలుపు బాట పట్టించాడు లబూషేన్.